గెలిస్తే గౌరవ వేతనాన్ని ప్రజా అవసరాలకు వినియోగిస్తా..

Sun,May 12, 2019 12:23 AM

లక్ష్మీదేవిపల్లి: జెడ్పీటీసీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని ప్రజల అవసరాలకు వినియోగిస్తానని లక్ష్మీదేవిపల్లి మండల జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి మేరెడ్డి వసంత అన్నారు. శనివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే ప్రజల సమస్యలపై పోరాటాలు చేసి అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజల అవసరాల కోసం పనిచేసినట్లుగా ఆమె వివరించారు. సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల మద్దతుతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలైన పోడు భూములు, ఫారెస్టు భూములు, అంబసత్రం భూములు, కారుకొండ పరిసరాల్లో ఉన్న భూ సమస్యలపై పోరాడేందుకు ఎజెండాగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, గెలుపోటములు సహజమన్నారు. తన భర్త మేరెడ్డి జనార్దన్‌రెడ్డికి మండల వ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు, అభిమానులు ఉన్నారని, ఆయనతో పాటు ప్రజలు తనను గెలిపించుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటువేసి గెలిపించుకోవాలని కోరారు.కాగా, మండలంలోని లక్ష్మీదేవిపల్లి, ప్రశాంతినగర్, హేమచంద్రాపురం, అశోక్‌నగర్, సంజయ్‌నగర్, గిరిప్రసాద్ నగర్, జయశంకర్ కాలనీ,లోతువాగు, మోకాళ్లగుంపు గ్రామాల్లో శనివారం ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తనకు అవకాశం కల్పించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నరేష్, పూనెం శ్రీను, చింతా నాగమణి, తాటి విజయ్, వెంకటేష్, సందీప్, ఇక్బాల్, శిరీష, సాయి, రామకృష్ణ, కుమార్

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles