కారుగుర్తుపై ఓటు వేయండి..

Sun,May 12, 2019 12:23 AM

లక్ష్మీదేవిపల్లి: కారుగుర్తుపై ఓటువేసి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం లక్ష్మీదేవిపల్లి మండల జెడ్పీటీసీ అభ్యర్థి తూము శేషుకుమారి, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం నిర్వహించిన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. మండలంలోని రేగళ్ల, శ్రీనగర్, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తూ కార్తుగుర్తుపై ఓట్లువేసి గెలిపించాలని కోరారు. శ్రీనగర్ కాలనీలో జెడ్పీటీసీ అభ్యర్థి తూము శేషుకుమారి, ఎంపీటీసీ అభ్యర్థి కొల్లు పద్మతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావుకు ప్రజలు పూలదండలు వేసి సత్కరించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. మండల వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీచేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కారుగుర్తుపై ఓట్లువేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో కొత్తగూడెం అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు పోతుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు వనమా రాఘవేందర్‌రావు, మండల టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి ఊకంటి గోపాలరావు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, కొట్టి వెంకటేశ్వర్లు, తూము చౌదరి, బండి రాజుగౌడ్, కొదురుపాక రాజేంద్రప్రసాద్, రామంచి శ్రీను,నిమ్మకాయల నర్సింహారావు, జనార్థన్, మాడిశెట్టి శ్రీనివాస్, సాంబ సురేందర్, కొదుమూరి సత్యనారాయణ, కొండల్‌రావు, కాసుల ఉమారాణి, కాసుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles