సంక్షేమ పథకాలే గెలుపునకు అస్ర్తాలు

Sun,May 12, 2019 12:23 AM

చుంచుపల్లి: ప్రజా సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ గెలుపునకు అస్ర్తాలు అని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నాడు. శనివారం పెనుబల్లి పంచాయతీలో ప్రచారంలో పాల్గొని టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. టీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలు వాస్తవాలను గమనించాలని ఆమె కోరారు. జడ్పీటీసీ అభ్యర్థి కంచర్ల చంద్రశేఖర్‌ప్రజలకు అందుబాటూలో ఉంటాడని ప్రజల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి అని ఆమె ఓటర్లకు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే 426 సంక్షేమపథాలను తీసుకొచ్చి ప్రజాసంక్షేమ పథకాలను అత్యధికంగా ప్రవేవపెట్టిన రాష్ట్రంగా మిగిలిందన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా నిరాజనాలు పడుతున్నారని ప్రజల ఆశ వమ్ముచేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలను పరిష్కారానికి కృషి చేసి మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలబెడతానని కంచర్ల ఓటర్లకు హామీ ఇచ్చారు. కొత్తగూడెం నియోజవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు వనమా రాఘవ, రజాక్, మాజీ జడ్పీటీసీ పరంజ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థి భూక్యా రుక్మిణి, కొడిక్యాల సమ్మయ్య, నాగేష్, కనకరాజు, భూక్యా భీముడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles