జయరామ.. శ్రీరామ..!

Sat,May 11, 2019 12:30 AM

-భద్రాద్రిలో ముగిసిన శ్రీరామ పునర్వసు దీక్ష
-శ్రీరామదీక్షాపరుల గిరి ప్రదక్షిణ
-కనుల పండువగా రథోత్సవం

భద్రాచలం, నమస్తే తెలంగాణ;భద్రాచలం పుణ్యక్షేత్రంలో శుక్రవారం జరిగిన శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ వేడుక కనుల పండువగా సాగింది.. వివిధ ప్రాంతాల నుంచి భద్రాద్రికి చేరుకున్న రామదీక్షాపరులు తిరువడి సామగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ అగ్రభాగాన రామాలయ కార్యనిర్వహణాధికారి తాళ్లూరి రమేష్‌బాబు స్వామి వారి పాదుకలను శిరస్సుపై ఉంచి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రాత్రి ఘనంగా రథోత్సవం జరిగింది. కాగా నేడు స్వామివారికి పట్టాభిషేకం జరుగనుంది.

భద్రాచలం,ళె శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ వేడుక కనుల పండువగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం చేరుకున్న రామదీక్షపరులు గోదావరి నదీ తీరానికి చేరుకొని పుణ్య స్నానాలాచరించారు. అనంతరం రామాలయానికి చేరుకొని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. చిత్రకూట మండపం ఆవరణలో దేవస్థ్ధానం అందజేసిన తిరువడి సామగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరువడిధారణ చేసి భద్రగిరి ప్రదిక్షణలు మూడుసార్లు గావించారు. గిరి ప్రదిక్షణ అగ్రభాగాన రామాలయం కార్యనిర్వహణాధికారి తాళ్లూరి రమేష్‌బాబు స్వామివారి పాదుకలను శిరస్సుపై ధరించి పాల్గొన్నారు. రామాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రదక్షిణ కల్యాణ మండపం రోడ్డు, బ్రిడ్జీ సెంటర్, కూనవరం రోడ్డు, ఎల్‌ఐసీ సెంటర్, తాతగుడి సెంటర్, రాజవీధి మీదుగా తిరిగి రామాలయానికి చేరుకుంది. అనంతరం శ్రీరామ దీక్షపరులు తమ తిరువడిని భద్రుని సన్నిధిలో సమర్పించారు. భక్తులకు దేవస్థానం ఉచిత రామార్పణం(భోజనం) అందజేసింది. శ్రీరామదీక్షితుల కోసం రాత్రివేళ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి రోజున ఈ శ్రీరామదీక్ష ప్రారంభం కాగా, శుక్రవారంతో ముగిసింది. శనివారం ఆలయంలో స్వామివారికి పట్టాభిషేకం జరపనున్నారు.

శ్రీరామ క్రతువుకు పూర్ణాహుతి..
భద్రాచలం పట్టణంలోని జియర్ మఠంలో నిర్వహిస్తున్న శ్రీరామ క్రతువుకు శుక్రవారం పూర్ణాహుతి నిర్వహించారు. అహోబిల రామనుజ జీయర్‌స్వామి వారు 27 రోజులుగా ఈ శ్రీరామ క్రతువును జరిపించారు. ఇందులో భాగంగా భగవత్ రామానుజులు వారి 1003 జయంతి రోజైన గురువారం శ్రీరామ విజయం వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీరామ క్రతువును పురస్కరించుకొని తొలత విశ్వక్షేణ ఆరాధన, పుణ్యహావచనం జరిపారు. తదుపరి అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీరామ క్రతువుకు పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా అహోబిల రామానుజ జియర్ స్వామివారు భక్తులనుద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్‌లో భద్రాచలంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామాలయం వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, నిర్వహకులు జి. వెంకటాచార్యులు, జనార్దన్ బట్టార్, తిప్పన సిద్దులు, యశోద రాంబాబు, భక్తులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles