అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Sat,May 11, 2019 12:28 AM

పాల్వంచ, మే 10: కట్టుకున్న భార్యతో కలిసిమెలిసి కడవరకూ ఉండాల్సి భర్త అనుమానమే పెనుభూతమై భార్యను హత్యచేసిన సంఘటన పాల్వంచ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణ పరిధిలో గల సీతారాంపట్నం, మారుతినగర్‌కు చెందిన కందుకూరి అరుణ (35)ను భర్త కందుకూరి శివ శుక్రవారం తెల్లవారుజామున అతి దారుణంగా కిరాతకంగా కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. భద్రాచలం పట్టణానికి చెందిన కొమరరాజు ఈశ్వరయ్య మూడో కుమార్తె అరుణను పాల్వంచ పట్టణం సీతారాంపట్నంలొని మారుతీనగర్‌కు చెందిన కందుకూరి శివకు 15 ఏళ్ల క్రితం ఇచ్చి పెళ్లి చేశారు. ఈశ్వరయ్యకు శివ సొంత బావమరిది అవుతాడు. మేనమామైన శివకు అరుణను ఇచ్చి పెళ్లి చేశారు. వారి కాపురం సజావుగానే నడుస్తున్నది. వీరికి 8 ఏళ్ల పాప, 6ఏళ్ల బాబు ఉన్నారు. శివ ఇస్త్రీ బండి నడిపే వాడు. కొంత కాలం నుంచి ఇళ్ల ప్లాట్లు అమ్మి పెట్టడం వంటి మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత సంవత్సరం కాలం నుంచి భార్య అరుణ మీద అక్రమ సంబంధం అనుమానం పెంచుకున్నాడు. ఎవరితో మాట్లాడినా కూడా భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. దీనిపై కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టి ఇద్దరిని సక్రమంగా ఉండమని చెప్పారు. అయినా శివ ఇటీవల కాలంలో అరుణను వేధింపులకు గురి చేసి కొట్టేవాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగి ఇంటిలో ఉన్న కర్రను శివ తీసుకుని అరుణ మొఖం మీద కిరాతకంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే పడి మృతి చెందింది. అరుణ మృతి చెందిన వెంటనే శివ ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటి పక్కనే ఉన్న తమ్ముడు ఈ సంఘటనను చూసి పోలీసులకు తెలిపాడు. పట్టణ ఎస్సై ముత్యం రమేష్ సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు శివను పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అరుణ శవాన్ని పొర్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలవడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. పాల్వంచ సిఐ మడత రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles