నకిలీ, నిషేధిత పత్తి విత్తనాల గోదాముల్లో తనిఖీలు

Sat,May 11, 2019 12:28 AM

పాల్వంచ, మే 10: ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాల నిల్వలపై రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన సీఐ కరీముల్లా ఖాన్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్, పాల్వంచ ఏఓ పీఎస్ శంకర్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ట్రాన్స్‌పోర్ట్ సంస్థల ద్వారా అక్రమంగా ఇతర ప్రాంతా ల నుంచి వచ్చాయా అనే అనుమానంతో వివిధ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు చెందిన గోదాములను రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ తిరుపతి ఆదేశాల మేరకు అధికారులు అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం నిషేధించిన హెర్డిసైడ్ టాలరెంట్ (బీజీ-3) పత్తి విత్తనాలు, అదేవిధంగా గ్లెఫోసైట్ అనే కలుపు మందులను ఆయా ఎరువులు పురుగుమందుల షాపుల యజమానులు ఏమైనా అక్రమంగా ట్రాన్స్‌పోర్ట్ సంస్ధ్థ ద్వారా తీసుకువచ్చారా అనే అనుమానాల తో ముందస్తుగా తనిఖీలు చేశారు. అన్ని ట్రాన్స్‌పొర్ట్ కార్యాలయాలు, గోదాములలో ఉన్న పార్శిల్స్‌లను, రికార్డులను వారు తనిఖీ చేపట్టారు. నిషేధించిన వీటిని ఏవరైనా వ్యాపారులు అమ్మకాలు జరిపినట్లయితే ఆట్టి సమాచారాన్ని తమకు అందజేయాలని రైతులను కోరారు. నిషేధిత పత్తి, కలు పు మందులు అమ్మితే సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1985, పురుగుమందుల చట్టం 1968 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles