టీఆర్‌ఎస్‌ను గెలిపించండి

Sat,May 11, 2019 12:28 AM

లక్ష్మీదేవిపల్లి: టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థి తూము శేషుకుమారి, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం నిర్వహించిన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. మండలంలోని అనిశెట్టిపల్లి, కూనవరం, ఎస్సీ కాలనీ గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తూ కార్తుగుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ అభ్యర్థి తూము శేషుకుమారి కారు గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సీఎంకేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. మండల వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కారుగుర్తుపై ఓట్లు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో కొత్తగూడెం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు పోతుందని పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల ఉమారాణి, వనమా రామకృష్ణలతో కలిసి రేగళ్ల , సాటివారిగూడెం, చాతకొండ పంచాయతీల్లో తూము శేషుకుమారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జెడ్పీటీసీతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాభివృద్ధి వైపునకు బాటలు వేయాల్సిందిగా అక్కడి ఓటర్లను అభ్యర్థించారు. లక్ష్మీదేవిపల్లి మండల ఎన్నికల టీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి ఊకంటి గోపాలరావు, తూము చౌదరి, కొట్టి వెంకటేశ్వర్లు, ఆళ్ల మురళి, కాసుల వెంకట్, బండి రాజుగౌడ్, జల్లి శ్రీను పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles