తొలి విడుత స్క్రూట్నీలో..12 నామినేషన్ల తిరస్కరణ


Fri,April 26, 2019 12:52 AM

(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ)భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి విడుత మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. బుధవారంతో తొలి విడుత ఎన్నికలు జరిగే ఏడు మండలాల జడ్పీటీసీ, ఆరు మండలాల ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. గురువారం ఈ నామినేషన్లను స్క్రూట్నీ చేసిన అధికారులు అనంతరం నామినేషన్లు సరిగా ఉన్న వివరాలను వెల్లడించారు.


ఏడు జడ్పీటీసీ స్థానాలకు..
మొత్తం ఏడు జెడ్పీటీసీ స్థానాలకు గాను 92 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంట్లో రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఏడు జడ్పీటీసీ స్థానాలకు 78 మంది నామినేషన్లు అర్హత సాధించాయి. ఆరు మండలాల్లోని 71 ఎంపీటీసీ స్థానాలకు 522 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 472 మంది నామినేషన్లు అర్హత సాధించాయి. ఒక్కో అభ్యర్థి రెండు, మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో స్క్రూట్నీలో అధికారులు ఆ నామినేషన్లను తొలగించారు. శుక్రవారం నాడు నామినేషన్లలో తప్పులున్నా, తప్పుడు సమాచారం ఇచ్చినా వాటిని తిరస్కరిస్తారు. 28న ఉపసంహరణలు, అదే రోజు బరిలో ఉండే తుది జాబితాను ప్రకటిస్తారు. మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొదటి దశ ఎన్నికలు కొనసాగుతాయి.

నేటి నుంచి రెండో విడుత నామినేషన్లు..
జిల్లాలోని కరకగూడెం, మణుగూరు, పినపాక, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, దమ్మపేట, జూలూరుపాడు మండలాల్లో రెండో విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండో దశ ఎన్నికలకు గాను శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ నెల 28 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 29న స్క్రూట్నీ చేస్తారు. అనంతరం తుది జాబితా ప్రకటిస్తారు. 30న ఫిర్యాదులు స్వీకరించి మే ఒకటో తేదీన నామినేషన్లలో తప్పులున్నా, తప్పుడు సమాచారం ఇచ్చినా వాటిని తిరస్కరిస్తారు. మే 2న ఉప సంహరణ ప్రక్రియ ముగుస్తుంది. అదేరోజు సాయంత్రం తుదిజాబితాను ప్రకటిస్తారు. మే10న రెండో దశ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

144
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles