మే 3 వరకూ పీపీఎల్-2

Fri,April 26, 2019 12:51 AM

మయూరిసెంటర్, ఏప్రిల్ 25: హెచ్‌సీఏ, కేడీసీఏ సంయుక్త సారథ్యంలో ఈ నెల 26 నుంచి మే 3 వరకూ పటేల్ స్టేడియంలో పువ్వాడ ఉదయ్‌కుమార్ మెమోరియల్, పువ్వాడ ప్రీమియర్ లీగ్ డే అండ్ నైట్ క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నామని పీపీఎల్-2 ప్రతినిధులు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, వెంకట్, మసూద్ తెలిపారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీపీఎల్-2 ప్రారంభోత్సవం ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు స్టేడియంలో జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథులుగా ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్, గౌరవ అతిథులుగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, ఆత్మీయ అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, మమత ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ పువ్వాడ జయశ్రీ హాజరవుతారన్నారు.

విజేతలకు ప్రథమ బహుమతి రూ.2 లక్షలు, రన్నర్స్‌కు రూ.1.5 లక్షలు, పీపీఎల్ -2 ట్రోపీతోపాటు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. మ్యాన్ ఆఫ్ ది పీపీఎల్‌కు యమహా బైక్, బెస్ట్ బ్యాట్‌మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ కీపర్‌లకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. మెగా మాస్టర్స్ టీమ్‌కు వీవీసీ మోటార్స్, జాబిశెట్టి హాస్పిటల్ టీమ్‌కు ఆర్కాహోండా, కేజీఎఫ్ ఎలెవన్ టీమ్‌కు స్నేహా డయాగ్నస్టిక్స్, బ్లూస్టార్స్ కొత్తగూడెం టీమ్‌కు బాలాజీ ఎస్టేట్స్, రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు రెస్ట్ ఇన్ హోటల్, ఎవలెన్‌స్టార్స్ టీమ్‌కు ఎస్‌బీఐటీ, పాల్వంచ టీమ్‌కు ఆర్‌కేసీసీలు ఫ్రాంచైజీలుగా వ్యవహరిస్తారని వివరించారు. చాంపియన్స్ క్లబ్, ఎంఎస్ మిలీనియం, మారుతి ప్లస్ టీములకు వారే కు ఫ్రాంచైజీలుగా ఉంటారని వెల్లడించారు. మాస్టర్ క్లాస్ సీసీ ఫ్రాంచైజీకు టీమ్ త్వరలో వెలువడనుందని చెప్పారు. సందీప్, బుర్రి వినయ్, పారూఖ్, మమ్ము, అబ్బాస్ పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles