టీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయాలి

Fri,April 26, 2019 12:51 AM

జూలూరుపాడు: టీఆర్‌ఎస్ బలోపేతానికి పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కోరారు. టీఆర్‌ఎస్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కరివారిగూడెం సర్పంచ్ శాంతిరామ్, కొమ్ముగూడెం సర్పంచ్ శాంతిలాల్, మాచినేనిపేటతండా సర్పంచ్ లాకావత్ భారతితో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీ సీసీ సభ్యులు లాకావత్ గిరిబాబు, సీపీఎం మండల మాజీ కార్యదర్శి సీనియర్ నాయకులు యాసా కొండలరావు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.100 కుటుంబాలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరాయి. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ..టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ఆకర్శితులై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వస్తున్నా రన్నా రు.పార్టీలో చేరిన నాయకులు,కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటానని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. త్వ రలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేయాలన్నారు.

గ్రామాల్లో నాయకులు అందరినీ కలుపుకొని సమష్టిగా పనిచేసి అభ్యర్థుల గెలుపు కోసం ముందుకు సాగాల న్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, రైతుబంధు,రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి రైతుపక్షపాతి ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, యల్లంకి సత్యనారాయణ,టీఆర్‌ఎస్‌పార్టీ మండల అధ్యక్ష,కార్యదర్శి చావా వెంకటరామారావు,రామిశెట్టి రాంబాబు, ఎంపీపీ మూడు చిట్టిబాబు, నాయకులు రోకటి సురేష్, దుద్ధుకూరి మధుసూదన్‌రావు, నర్సింహారావు తదితరులు ఉన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles