నేటి నుంచి టెన్త్, ఇంటర్ ఓపెన్ పరీక్షలు

Wed,April 24, 2019 12:48 AM

ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు డీఈఓ మదన్‌మోహన్ పర్యవేక్షణలో చేశారు. బుధవారం నుంచి మే 9వ తేది వరకు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పది పరీక్షలకు జిల్లా కేంద్రంలో 6 సెంటర్లలో 1026మంది రెగ్యులర్, 383 మంది సప్లమెంటరీ విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్ పరీక్షలకు 5 కేంద్రాలలో 795 మంది రెగ్యూలర్, 345 మంది సప్లమెంటరీ విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రతి పరీక్ష కేంద్రంలో రెవెన్యూ శాఖ నుంచి సిట్టింగ్ స్కాడ్స్‌ను ఏర్పాటుచేశారు. చీఫ్ సూపరిండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ అధికారులకు పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన సూచనలు చేశారు. ఎలాంటి చిన్న పొరపాట్లు చోటుచేసుకోకుండా పకడ్బందీగా ప్రక్రియ సాగాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

విద్యార్థులకు సూచనలు...
. పరీక్ష రాసే విద్యార్ధులు పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో ఒక రోజు ముందు వెళ్ళి
చూసుకోవాలి.
. గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలి.
. ప్రశ్నాపత్రం ప్రతి పేజీపై హాల్‌టిక్కెట్ నెంబర్ తప్పనిసరిగా వేయాలి.
. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదు.
. పరీక్ష సమయం ముగిసే వరకు హాల్‌లోనే ఉండాలి. బయటకు వెళ్ళకూడదు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles