జిల్లా ప్రధానాస్పత్రిల్లో సెంట్రల్ హెల్త్ టీం సందర్శన

Wed,April 24, 2019 12:47 AM

మయూరిసెంటర్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్యసేవలను సెంట్రల్ హెల్త్ టీం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఈ బృదం టీబీ వైద్యశాలను సందర్శించి రోగుల వివరాలు, వారికి అందుతున్న వైద్యసేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి మాతా శిశు సంక్షణ కేంద్రానికి వెళ్లి అక్కడ అన్ని విభాగాలు కలియ తిరిగి రోగుల రిజిస్టర్ పట్టికను పరిశీలించి, వైద్యసేవలు పొందుతున్న రోగులను నేరుగా వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కంగారో మథర్ కేర్ సేవలు, వైద్యుల పనితీరు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీలు జేమ్స్, పరమేశ్వర్(సెంట్రల్ టీం బృందం) జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బీ కళావతిబాయి, వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంఓ డాక్టర్ కృపా ఉషశ్రీ, నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరాం పాల్గొన్నారు.
ఏదులాపురం టీబీ క్లబ్ సందర్శన..
ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, ఏప్రిల్ 23 : రూరల్ మండలం ఏదులాపురంలోని టీబీ క్లబ్‌ను మంగళవారం సెంట్రల్ టీబీ విభాగం డిల్లీ ప్రతినిధి బృందం సందర్శించింది. క్లబ్ మెంబర్స్ చేస్తున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. భారతదేశంలో అనేక పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాధి ఔషదాలకు స్పందించని జఠిలమైన వ్యాధిగా రూపాంతరం చెందిందని ఈ పరిస్థితుల్లో 2030వ సంవత్సరంలోపు టీబీ వ్యాధి రహిత భారతదేశం తయారు చేయడమే లక్ష్యంగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం వ్యాధి నయం అయిన వారిని ప్రత్యక్షంగా అడిగి వారి వివరాలను తెలుసుకున్నారు. చికిత్స పూర్తి చేసుకున్న బహుళ ఔషద వ్యాధిగ్రస్తులను( ఎండీఆర్-టీబీ) విచారణ చేశారు. క్లబ్ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల రెండవ గురువారంలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అనురాగ్‌జయంతి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ కళావతిబాయి, డాక్టర్ సుబ్బారావు, పీహెచ్‌సీ డాక్టర్ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వీఆర్‌వో వెంకట్, ఉపేందర్, దండి సురేష్, ఏఎన్‌ఎమ్‌లు, ఆశావర్కర్లు తదితరులు ఉన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles