మాతా, శిశు మరణాలు లేకుండా చూడాలి

Wed,April 24, 2019 12:47 AM

అశ్వాపురం, ఏప్రిల్ 23: పీహెచ్‌సీ పరిధిలో మాతా, శిశు మరణాలు లేకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యకర్తలతో సమావేశమ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీ పరిధిలోని గర్భిణులను 3 నెలల లోపు నమోదు చేయవచ్చన్నారు. ప్రతీ గర్భిణీని పీహెచ్‌సీ డాక్టర్ నాలుగు సార్లు వైద్యం చేయాలని, అంతేకాక వారికి హెచ్‌ఐవీ, హిమోగ్లోబిన్, చక్కెరవ్యాధి వంటి పరీక్షలు తప్పని సరిగా చేయాలని ఆదేశించారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని ఓఆర్‌ఎస్, మజ్జిగ తీసుకోవాలన్నారు. ఈజీఎస్ కూలీలకు 2600 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసామన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పని ముగించుకొని నీడ పట్టున ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, వైధ్యాధికారి మణికంఠరెడ్డి, వైధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles