తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోల ఘర్షణ

Wed,April 24, 2019 12:47 AM

సారపాక, ఏప్రిల్ 23 : తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు వీఆర్వోలు ఘర్షణ పడిన సంఘటన మండల కేంద్రంలోని బూర్గంపాడులో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని అంజనాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమికి హక్కు పత్రాలు కల్పించేందుకు సంబంధిత పినపాక పట్టీనగర్ వీఆర్వో డబ్బులు తీసుకుని... తీరా ఆ భూమి పాసు పుస్తకం విషయంలో చొరవ చూపడంలేదని బాధిత రైతు వీఆర్వోను నిలదీశాడు. సదరు వ్యక్తి గత ఆరు నెలలుగా పట్టా పాస్ పుస్తకం కోసం తిరుగుతుండటంతో బాధితుడిని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వీఆర్వో కావాలనే రెచ్చగొట్టి తనతో గొడవ పెట్టుకునేట్లు చేశారని ఆరోపిస్తూ ఆ వీఆర్వోపై సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయంలో పినపాక పట్టీనగర్ వీఆర్వో ఘర్షణకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తహసీల్దార్ ఇరువురిని సముదాయించి శాంతింపచేయడంతో గొడవ సద్దుమణిగింది. ఈ విషయంపై పినపాక పట్టీనగర్ వీఆర్వో రమాదేవిని వివరణ కోరగా బాధిత వ్యక్తికి సంబంధించిన భూమి విషయంపై నాకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు అవాస్తమని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. తహశీల్దార్ రమాదేవిని వీఆర్వోల ఘర్షణపై వివరణ కోరగా ఇది ప్రైవేటు విషయమని, దీనిలో తనకు, తన కార్యాలయానికి ఎలాంటి సంబంధంలేదని చెప్పడం కొసమెరుపు.

63
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles