వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Wed,April 24, 2019 12:47 AM

రఘునాథపాలెం : ద్విచక్ర వాహనాన్ని లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి ఇల్లెందు ప్రధాన రఘునాథపాలెం వద్ద చోటు చేసుకుంది. రఘునాథపాలెం ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరం సారధినగర్‌కు చెందిన తొగరు అఖిల్ వెంకటసాయి(22) హోటల్ మేనేజ్‌మెంట్‌గా చేస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి అత్యవసర పనుల నిమిత్తమై కారేపల్లిలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లవలసి తన మిత్రుడైన వడ్డేపల్లి నితీష్‌తో టీఎస్04ఈపీ5756 నెంబరు గల ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మార్గంలో రఘునాథపాలెం స్టేజీకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఏపీ24వై 8588 నెంబరు గల అశోక్ లేల్యాండ్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న అఖిల్ వెంకటసాయి మీదుగా లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుైజ్జె అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ద్విచక్ర వాహనం వెనుకాల కూర్చున్న నితీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హుటాహుటిన నితీష్‌ను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతిచెందాడని ఆరోపిస్తూ లారీ డ్రైవర్ రామన్నపేటకు చెందిన పందిపోలు బుచ్చిబాబుగా తెలుసుకొని తండ్రి తొగరు రమేష్ రఘునాథపాలెం పోలీస్ స్టేషనల్ ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి..
దమ్మపేట : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నల్లకుంటలో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దిబ్బగూడెం గ్రామానికి చెందిన రావుల పోలయ్య(50) ద్విచక్రవాహనంపై పనినిమిత్తం దమ్మపేట వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా నల్లకుంట గ్రామశివారులో మధ్యాహ్నం సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా వచ్చి వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో పోలయ్య తలకు, ఛాతికి తీవ్రగాయాలు కావడంతో అక్కడ స్థానికులు ఆయనను ఆటోలో మందలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని ఆయనకు చికిత్స చేయించగా పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. మృతునికి భార్య రావుల రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జలకం ప్రవీణ్ తెలిపారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles