ప్రభుత్వ నిధులతో జల్సాలు

Mon,April 22, 2019 11:38 PM

ఖమ్మం క్రైం, ఏప్రిల్22: ప్ర భుత్వ నిధులను దుర్వినియో గం చేసి నిరుద్యో గులకు రుణా లు ఇప్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వ్యక్తులను పోలీ సులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నగర ఏసీపీ వెంకట్రావు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీలకు అందించే రుణాల నిధులు అక్రమాలు జరిగాయని బాధితులు జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వై ప్రభాకర్ ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు విచారణ చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. ఖమ్మం నగరానికి చెందిన వేముల సునీల్‌కుమార్ 2015-16 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన లబ్ధిదారుల జాబితాను తీసుకుని అందులో 45 మందిని ఎంపిక చేసుకొని వారికి నేరుగా ఫోన్ చేసి తానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పరిచయం చేసుకుని నమ్మించాడు. లబ్ధిదారులకు రుణాలు ఎక్కువగా మంజూరు కావాలంటే తమకు ముందుగా కొంత మొత్తం నగదు చెల్లించాలని సూచించాడు. అందులో 21 మంది లబ్ధిదారులు సునీల్ మాటలు నమ్మి రూ.5,38, 500ల నగదును ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్, రుణాలకు కోటేషన్లు అందించే ప్రైవేటు వ్యక్తి భానుప్రసాద్ సహకారంతో దొంగ డాక్యుమెంట్లను సృష్టించారు.

43 యూనిట్లకు రూ.2కోట్ల 92లక్షల 50వేల నగదును హవాల మార్గంలో వేర్వేరు ఖాతాల్లోకి రుణాల నగదును మళ్లించారు. ఈ పెద్ద మొత్తానికి లబ్ధిదారులకు వారు ఏర్పాటు చేయాల్సిన యూనిట్లకు సంబం ధించిన వస్తువులు ఇవ్వకుండా దుర్వినియోగానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మంజూరైన రుణంలో రూ కోటి 28 లక్షల సబ్సీడి నగదును బ్యాంకు అధి కారులు మంజూరు చేయడం జరిగిందని ఆ నగదును తమకు సంబంధించిన వ్యక్తుల ఖాతాలలో వారు మళ్లించారు. అనంతరం లబ్ధిదారులు తమ రుణాల కోసం వారి చుట్టూ ఎన్ని సార్లు తిరిగినప్పటికి వారికి చెందాల్సిన సబ్సీడి, బ్యాంకు రుణాలు ఇవ్వకుండా ఏయిర్ గన్‌తో బెదిరింపులకు పాల్పడినాడు. దీంతో విసుగు చెందిన లబ్ధిదారులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. మళ్లించిన నగదుతో వాహనాలు కొనడంతో పాటు ఇతర జల్సాలు చేయడంతో పాటు తన అనుచరులకు కొంత ముట్ట చెప్పాడు. సోమవారం వేముల సునీల్‌కుమార్ వెంకటగిరి గేటు సమీపంలో ఉన్నట్లు సమచారం తెలుసుకున్న రెండో పట్టణ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న ఏపీ10ఏడబ్ల్యూ 8388 నెంబర్‌గల పార్చనర్ కార్, 3ఎయిర్‌గన్స్, ఇతర దస్తావేజులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న భానుప్రసాద్, సురేష్‌లను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు. ఈ సమావేశంలో సీఐ నరేందర్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles