స్థానిక ఎన్నికలపై ఎమ్మెల్యే వనామాతో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌ల సమావేశం

Mon,April 22, 2019 11:37 PM

పాల్వంచ: వచ్చే నెలలో నిర్వహించే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌లు చర్చించారు. పాత పాల్వంచలోని వనమా వెంకటేశ్వరరావు స్వగృహానికి టీఆర్‌ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రావుల శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక సంస్థల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలుసుకుని ఎన్నికలపై చర్చించారు. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో ఎలాంటి గ్రూపులు లేకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని స్థానాలను కైవశం చేసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. అందరినీ సమన్వ పర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తామని, ఇందుకు మీ అందరి సహాయ సహాకారాలతో ముందుకు వెళ్తానని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడని, ఆయన సారథ్యంలో పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉన్నదని ఎమ్మెల్యే తెలిపారు. వారితో పాటు టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు వనమా రాఘవేందర్‌రావు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles