కేటీపీఎస్ ఏడో దశ 12వ యూనిట్‌లో పూర్తిస్థాయి

Mon,April 22, 2019 11:37 PM

- విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

పాల్వంచ: కేటీపీఎస్ ఏడో దశ 12వ యూనిట్‌లో సోమవారం నుంచి పూర్తిస్థాయి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని తిరిగి చేపట్టారు. ఈ నెల 17వ తేదీన యూనిట్‌లోని బాయిలర్ ట్యూబ్స్ లీకేజీ జరిగి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి బాయిలర్ ట్యూబ్స్ లీకేజీలతో పాటు మిగిలిన బాగాల్లోని మరమ్మతు పనులను పూర్తిచేశారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 9గంటలకు యూనిట్‌ను ఆయిల్‌తో బాయిలర్‌ను మండించి లైటప్ చేశారు. అనంతరం ఆర్థరాత్రి నుంచి యూనిట్‌లో తిరిగి విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు. అంచెలంచెలుగా యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంటూ తిరిగి సోమవారం తెల్లవారుజామున 2గంటలకు పూర్తిస్థాయి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌కు అత్యంత డిమాండ్ ఉన్న సమయంలో ఏడో దశలో తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో రాష్ట్ర గ్రిడ్‌కు అదనపు భారం తప్పింది. యూనిట్ అప్పటి నుంచి నిరంతరాయంగా ఎలాంటి ఒడదొడుకులు లేకుండా పూర్తిస్తాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నదని ఏడో దశ ఎస్‌ఈ ఎం శ్రీనివాసరావు నమస్తే తెలంగాణకు తెలిపారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles