కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారంలో ఉత్పత్తి పునః ప్రారంభం

Mon,April 22, 2019 12:53 AM

పాల్వంచ,ఏప్రిల్21: పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశ 12వ యూనిట్‌లో ఆదివారం తిరిగి విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు. ఈ నెల 17వ తేదీన యూనిట్‌లోని బాయిలర్ ట్యూబ్ లీకవడంతో ఇంజనీర్లు యూనిట్‌ను హ్యాండ్ ట్రిప్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో కేటీపీఎస్ నుంచి రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా చేస్తున్న 800మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అంతరాయం ఏర్పడింది. అప్పటి నుంచి కేటీపీఎస్, బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్లు యుద్ధ్దప్రాతిపదిన మరమ్మతు చర్యలు చేపట్టారు. నూతనంగా నిర్మించిన కర్మాగారం కావడంతో అధికారులు ఎప్పటి కప్పుడూ అప్రమత్తంమవుతూ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సహజంగా ఏ యూనిట్ లోనైనా కూడా బాయిలర్‌లోని ట్యూబ్స్ ప్రధానంగా లీకేజీలు ఏర్పడు తుంటాయి. వాటిని అధిగమించి లీకేజీలు రాకుండా చర్యలు తీసుకుంటున్నా కూడా అనుకోని సమయాల్లో లీకేజీలు తలెత్తి అత్యవసర పరిస్థితుల్లోనే యూనిట్‌ను నిలిపివేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తడంతోనే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి యూనిట్‌ను నిలిపివేసి బాయిలర్ లో ప్రధానంగా ఏర్పడిన లీకేజీలతో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వాటని కూడా సరిచేశారు. అలాగే యూనిట్‌లోని మిగిలిన టర్బోజనరేటర్, ఇంకా మిగిలిన లోకేషన్లలలో ఉన్న చిన్నపాటి మరమ్మతులను, సాంకేతిక సమస్యలను సరిచేశారు.

తిరిగి యూనిట్‌లో మరళా ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్నింటిని సరిచూసుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం 9గంటలకు బాయిలర్‌ను ఆయిల్‌తో మండించి లైటప్ చేశారు. యూనిట్‌లోని అన్ని ప్యారామీటర్స్ అనుకూలంగా ఉన్న తర్వాత ఆదివారం అర్ధరాత్రి కల్లా విద్యుత్ ఉత్పత్తి తిరిగి చేపట్టారు. ఉత్పత్తిని అంచెలంచెలుగా పెంచుకుంటూ సోమవారం ఉదయం కల్లా యూనిట్‌లో పూర్తిస్థాయిలో 800మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న ట్లు ఏడో దశ ఎలక్ట్రికల్ విభాగం ఎస్‌ఈ ఎం. శ్రీనివాసరావు నమస్తేకు తెలిపారు. తిరిగి యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
విద్యుత్‌కు డిమాండ్ ఉన్న సమయంలో ఆగిన యూనిట్
అసలే వేసవి కాలం కావడంతో పాటుగా విద్యుత్‌కు రాష్ట్రంలో అత్యంత డిమాండ్ ఉన్న సమయంలో కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీఎస్ నుంచి రాష్ట్ర గ్రిడ్‌కు 800మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయినప్పటికీ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయంగా అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకున్నది.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles