అభ్యర్థుల ఎంపికపై చర్చ..

Mon,April 22, 2019 12:53 AM

చండ్రుగొండ/సారపాక: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నూటికి నూరుశాతం విజయం సాధించాలని టీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ నాయకులకు సూచించారు.ఆదివారం సారపాకలోని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్వగృహంలో సత్యవతి రాథోడ్ నాయకులు, కార్యకర్తలను , ముఖ్య నేతలను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి , అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. గెలిచే అభ్యర్థులకే సీట్లు కేటాయించాలని, గెలుపు, ఓటములను బేరీజు వేసుకొని ఎన్నికలను వ్యూ హత్మకంగా ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికి అందేలా చూడాలన్నారు. ప్రతి ఎంపీటీసీ,జెడ్పీటీసీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.ఇతర పార్టీలోని క్యాడర్ మన పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్యనాయక్, సన్నేపల్లి నాగేశ్వరరావు, కొత్తూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles