పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటుదాం..

Mon,April 22, 2019 12:52 AM

-స్థానిక సంస్థల ఎన్నికల టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
-విభేదాలను వీడి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి
పాల్వంచ:జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసి భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోని టీఆర్‌ఎస్ సత్తా చాటాలని ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి సత్యవతి రాథోడ్ పిలుపు నిచ్చారు. పాత పాల్వంచలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహంలో ఆదివారం సాయంత్రం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథాకాలను ప్రజలు స్వాగతిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసి టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిపిస్తారని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకపోయి అన్ని స్థ్ధానాలను మనమే గెల్చుకునే విధంగా పనిచేయాలని ఆమె అ న్నారు. ఈ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని, అలాగే నాయకుల మధ్య ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి ఎన్నికల్లో వారి సత్తా చాటుకోవాలని ఆమె కోరారు. సీఎం కేసీఆర్ నాయకులందరికీ కూడా స మాన అవకాశాలు కల్పిస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సమష్టిగా పనిచేయాలని ఆమె అన్నారు.

టీఆర్‌ఎస్‌కు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంపూ ర్ణ మద్దతు ఇవ్వడం సంతోషదాయకమని, ఆయన నాయకత్వంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో పాటుగా పాత, కొత్త నాయకులు, కార్యకర్తలంతా కూడా కలిసి పనిచేయాలని ఆమె కోరారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ గెల్చుకుని మన సత్తాను నిరూపించుకోవాలని ఆమె అన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు వనమా రాఘవేంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు, ఊకంటి గోపాల్‌రావు, జాలే జానకిరెడ్డి, కొత్వాల శ్రీనివాసరావు, మచ్చా శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి ముత్తయ్య, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఎస్వీఆర్‌కే ఆచార్యులు, రమణమూర్తి నాయుడు, దాసరి నాగేశ్వరరావు, శివారెడ్డి, విజయ్, మేడిద సంతోష్ గౌడ్, కనగాల బాలకృష్ణ, రషీద్, కొత్వాల సత్యనారాయణ, మల్లెల రవిచంద్ర, కలగట్ల నాగిరెడ్డి, హర్ష, బరపటి ఆనంద్, శేఖర్, బాలినేని నాగేశ్వరరావు, వినయ్, చింతా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles