ఎన్నికల్లో సత్తా చాటాలి..

Mon,April 22, 2019 12:52 AM

వైరా, నమస్తే తెలంగాణ, ఏప్రిల్21: వైరా నియోజకవర్గంలో మూడు విడతల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు అన్నారు. ఖమ్మంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ వైరా నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో మాదిరిగానే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి జడ్పీటీసీలు, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్నారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీలతో పాటు అన్ని ఎంపీటీసీల్లో గులాబీ జెండాను ఎగరవేయాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు భారతదేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

ప్రధానంగా రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా నూతన యంత్రాలపై సబ్సిడీ తదితర పథకాలు భారతదేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆసరా పెన్షన్‌లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పథకాలు చారిత్రాత్మకమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలను గ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా ఇంచార్జి శ్రవణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికలు ఎంపీ ఎన్నికల్లో లాగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక ఎంపీటీసీలను, అన్ని జడ్పీటీసీలను టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలను సమాయక్తం చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ రుణం తీర్చుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అన్ని స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం..
మధిర, నమస్తేతెలంగాణ : రానున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాలతో పాటు, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచే విధంగా టీఆర్‌ఎస్ పార్టీ కైవశం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మధిర నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని ఆదివారం ఖమ్మంలోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలన్నారు. నాయకులు తమతమ గ్రామాల్లో ఉండే పనిచేయాలని తెలిపారు. ఆశావహులు చాలా మంది ఉంటారని, పార్టీ ఎవరినీ నిర్ణయిస్తే వారి విజయం కోసం కృషిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమలరాజు, జిలా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, కోట రాంబాబు, మధిర నియోజకవర్గ ఐదు మండలా అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా సభ్యులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles