ఓసీ, భూగర్భగనులకు స్టార్ట్ రేటింగ్‌పై సమీక్ష

Sun,April 21, 2019 12:03 AM

ఇల్లెందు నమస్తే తెలంగాణ: ఇల్లెందు ఏరియా ఓసీ , భూగర్భ గనులకు సంబంధించి స్టార్టింగ్ రేట్ విధానం అమలుకై సమావేశం నిర్వహించారు. శనివారం వైసీవోఏ క్లబ్‌లో సింగరేణి సంస్థలో ఉపరితల, భూగర్భగనుల విధి విధానాలపై సేఫ్టీ జీఎం నాగభూషణ్‌రెడ్డి మాట్లాడారు. బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశానుసారంగా ఆపరేషన్ పారామీటర్స్, పర్యావరణ విషయాలు, ఉత్పత్తిలో మైనింగ్ ప్రాక్టీస్, టెక్నాలజీపై ఆర్థిక సూచనలు, ఆర్‌అండ్‌ఆర్ విషయాలకు సంబంధించిన రక్షణ, సెక్యూరిటీపై అవలంబిస్తున్న విధానాలపై సమీక్ష జరుపుతున్నట్లు తెలిపారు. సంబంధించిన సమాచారాన్ని కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్ వారికి అందజేస్తారని పేర్కొననారు. ఈ విషయాలను వారు పరిశీలన చేసి ప్రతీ ఓపెన్‌కాస్టు, భూగర్భ గనులకు స్టార్ట్ రేటింగ్ అవార్డును తయారు చేస్తుందని, తద్వారా స్టార్ట్ రేటింగ్‌లను ప్రతీ గనికి ఇవ్వబడుతాయని తెలిపారు. అధికారులు డి రాంచందర్, వెంకటేశ్వరరావు, జ్ఞాన సుందర్, దిలీప్‌కుమార్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, జానకిరామ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles