స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Sun,April 21, 2019 12:03 AM

టేకులపల్లి: జడ్పీటీసీ, ఎంపీపీ పీఠం లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యలు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏలాంటి విబేధాలు లేకుండా పార్టీ విజయమే అంతిమ లక్ష్యంగా కృషి చేద్దామని వారు కార్యకర్తలకు సూచించారు. పరిషత్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు వెలదండి సత్యనారయణ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని , కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగినట్లయితే మండలంలోని 14 ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలను సునాయసంగా గెలుచుకుంటామన్నారు. జనరల్ స్థానాల్లో గిరిజనేతరులకే అవకాశం ఇవ్వాలని స్థానికంగా ఉన్నవారిలో మంచి అభ్యర్థిని ఎంచుకోవాలని వారు సూచించారు. వర్గాలు సృష్టించి పార్టీని నష్టపరిచే చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి గెలుపునకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్కినేని సురేందర్, మండల ప్రధాన కార్యదర్శి బానోత్ రామా, టీఆర్‌ఎస్ నాయకులు బానోత్ హరిసింగ్‌నాయక్, బోడా శ్రీనివాస్, బోడా మంగీలాల్, చంద్రశేఖర్, బోడా బాలు, భద్రు, సంజయ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles