బాలికలదే పైచేయి

Fri,April 19, 2019 03:13 AM

- ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల
- గత సంవత్సరం కంటేఏడుశాతం అధికంగా ఉత్తీర్ణత
- రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమంలో ఆరోస్థానం, ద్వితీయంలో ఎనిమిదో స్థానం..
- ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఉత్తీర్ణత..

ఖమ్మం/ కొత్తగూడెం ఎడ్యుకేషన్ : ఇంటర్ ఫలితాల్లో గత సంవత్సరాలతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా స్థానం పడిపోయింది. గత ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో అద్భుత ఫలితాలు సాధిస్తూ, జిల్లాల విభజన అనంతరం అదే ఒరవడిలో నిలిపారు. ఖమ్మం జిల్లా ప్రథమంలో ఆరో స్థానం దక్కించుకోగా, ద్వితీయంలో నాల్గవ స్థానం దక్కించుకుంది. ఉత్తీర్ణత శాతం మూడు శాతం తగ్గింది. గత ఫలితాలతో పోల్చి చూస్తే ఫలితాల శాతం తగ్గుతూ స్థానం పడిపోయింది. ఇంటర్ ప్రధమ ఫలితాల్లో మేడ్చల్, రంగారెడ్డి, కోమ్రం భీమ్, కరీంనగర్, వరంగల్ అర్బన్ తర్వాత స్థానాల్లో ఖమ్మం జిల్లా నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా నాల్గవ స్థానంలో నిలిచింది. గతేడాది ఫలితాలతో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం తగ్గినప్పటికీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే కొంత మెరుగైన ఆరో, నాలుగు స్థానాల్లో నిలిచింది. నాలుగు సంవత్సరాల నుంచి జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంటుండగా ఈ దఫా దానిని కోనసాగించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 2శాతం ఉత్తీర్ణత తగ్గింది. ద్వితీయ ఇంటర్‌లో ఉత్తీర్ణత మూడు శాతం తగ్గింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎప్పటిలాగానే బాలికలే తమ హవా కొనసాగించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో సైతం బాలురుతో పాటు బాలికలు మెరుగైన ప్రతిభ కనబర్చి సత్తా చాటుకున్నారు. ప్రథమ ఇంటర్‌లో జిల్లా ఉత్తీర్ణతశాతం 65కాగా అందులో బాలికలు 71శాతం ఉత్తీర్ణతశాతం సాధించగా, బాలురు 59శాతంతో సరిపెట్టుకున్నారు. ద్వితీయంలో 69శాతం సాధించగా వారిలో బాలికలు 75శాతంతో రాణించగా, బాలురు 61శాతంతో ఆగిపోయారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 65శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గురువారం ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో రెండు శాతం ఉత్తీర్ణత తగ్గించి, జిల్లాస్థానాన్ని ఆరో స్థ్ధానానికి పడేశారు. జిల్లాలో ప్రభుత్వం, ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 14,534మంది విద్యార్థులకు 9,508 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలోబాలురు 6,837మందికి 4,037మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,697 మందికి 5,471మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా బాలురు 59శాతం, బాలికలు 71శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 2081మందికిగానూ 1251మంది ఉత్తీర్ణులై 60శాతం ఫలితాలు సాధించారు. గతేడాది ఒకేషనల్ విభాగంలో 67శాతం ఉత్తీర్ణత కాగా ఈ సంవత్సరం 60 శాతంతో 7శాతం తగ్గింది. ఓకేషనల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడో ర్యాంక్‌ను సాధించింది. ర్యాంకుల వేటలో ప్రైవేటు కళాశాలలు తమ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు పోటీ పడ్డాయి.
ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జనరల్ విభాగంలో 14,317 మంది విద్యార్థులకు 9,885 మంది ఉత్తీర్ణులై 69శాతం సాధించారు. బాలురు 6,689 మందికి 4142 మంది పాసై 61శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికల విభాగంలో 7,628 మందికి 5,743 మంది పాసైయి 75శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఓకేషనల్ విభాగంలో 1,039 మంది బాలురకు 734 మంది ఉత్తీర్ణులై 71శాతం నమోదు చేయగా, బాలికలు 875 మందికి 763మంది ఉత్తీర్ణులై 87శాతం సాధించారు. ఒకేషనల్ ద్వితీయంలో రాష్ట్ర స్థాయిలో నాల్గోవ స్థానాన్ని సాధించింది.

టాప్ మార్కులు సాధించిన విద్యార్థులు..
శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు చెందిన జీ సాయి సుప్రజ ఎంపీసీ విభాగంలో 990 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్, జూనియర్ ఎంపీసీలో శ్రీయ, స్నేహిత, సుష్మ 466 మార్కులతో, బైపీసీలో కే లహరి 985, కీర్తన -435 మార్కులు సాధించినట్లు కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. కృష్ణవేణి కళాశాలలో ఎంపీసీలో రీతిక 991 మార్కులు, బైపీసీలో వర్ష 985 మార్కులతో రాష్ట్ర స్థాయిలో స్థానం సాధించినట్లు అధిపతి యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. రెజోనెన్స్‌లో లక్ష్మీఖ్యాతి ఎంపీసీ విభాగంలో 986, జశ్మిత 464, బైపీసీలో శ్రీశరణ్య 985, దేవిక-430 మార్కులు సాధించినట్లు కళాశాలల డైరక్టర్స్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్ రావు తెలిపారు. న్యూవిజన్‌లో ఎంపీసీలో లక్ష్మీతన్మయి 988, సిరిచందన, మేఘన, శ్రేయలు465 మార్కులు సాధించారు. బైపీసీలో కే అన్విత 986, సానియా మహాక్ 433 మార్కులు సాధించినట్లు చైర్మన్ చుంచు గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు.

గురుకులాల సత్తా..
ఖమ్మం జిల్లాలో 14 గురుకుల కళాశాలల్లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో సత్తా చాటారు. అన్నపురెడ్డిపల్లి, కల్లూరు బాలికల కళాశాలలు నూరుశాతం ఫలితాలు సాధించాయి. ప్రథమ సంవత్సరంలో 84.3 శాతం ఉత్తీర్ణతతో, ద్వితీయ సంవత్సరంలో 89.29 శాతం ఉత్తీర్ణతతో రాణించారు. టేకులపల్లి కళాశాలలోని విద్యార్థిని శ్రావణి ఎంపీసీ విభాగంలో 972 మార్కులు సాధించింది. విద్యార్థులను ఆర్‌సీఓ, ఏఆర్‌సీఓ అభినందించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలికలదే హవా..
కొత్తగూడెం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గత ఏడాది జిల్లాలో 58 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఏడు శాతం అధికంగా ఉత్తీర్ణలయ్యారు. అన్ని విభాగాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. ఈ ఏడాది జిల్లా ప్రథమ సంవత్సరంలో ఆరోస్థానం, ద్వితీయంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం మొదటి సంవత్సరం పరీక్షకు 9,489 మంది విద్యార్థులు హాజరుకాగా 5,859 మంది ఉత్తీర్ణులయ్యారు. 61.74 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరానికి గాను మొత్తం 9,398 మందికి 6,127 మంది ఉత్తీర్ణులయ్యారు. 65 శాతం ఉత్తీర్ణగా నమోదైంది.

మొదటి సంవత్సరం జనరల్‌లో బాలురు మొత్తం 2959 మంది హాజరవగా, 1643 మంది ఉత్తీర్ణులయ్యారు. 55.52 శాతం సాధించారు. బాలికలు 4,462 మంది హాజరవగా 2,923 మంది ఉత్తీర్ణులయ్యారు. 65.05 శాతం నమోదైంది. మొదటి సంవత్సరం ఒకేషనల్ విభాగంలో.. బాలురు 919 మందికి గాను 490 మంది ఉత్తీర్ణులై 53 శాతం పాస్‌పర్సంటేజ్ నమోదైంది. బాలికలు 1,149 మందికి గాను 803 మంది ఉత్తీర్ణులయ్యారు. 69.88 శాతంగా నమోదైంది.

ద్వితీయ సంవత్సరం జనరల్‌లో.. బాలురు మొత్తం 2,995 మందికి గాను 1,740 మంది ఉత్తీర్ణులయ్యారు. 58.09 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు మొత్తం 4,370 మందికి గాను 2849 మంది ఉత్తీర్ణులయ్యారు. 65.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సుల్లో బాలురు మొత్తం 873 మందికి 575 మంది ఉత్తీర్ణులవగా, 65.86 శాతం ఉత్తీర్ణల నమోదైంది. బాలికలు మొత్తం 1,160 మందికి గాను 963 మంది పాసయ్యారు. 83.01 శాతంగా నమోదైంది.

61
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles