వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

Fri,April 19, 2019 03:10 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా గురువారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లతో నిర్వహించిన ఈసమీక్షలో జిల్లాలో శిశు మరణాలు, రోగులకు అందుతున్న సేవలు, కేసీఆర్ కిట్ల వినియోగం, సీబీ నాట్ పరికరం ద్వారా రోగులకు చేస్తున్న పరీక్షలు, ఈ బర్త్ రిజిస్ట్రేషన్, హెల్త్ ప్రొఫైల్, ఎన్‌సీడీ, కంటి వెలుగు ప్రోగ్రాంలో కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంతో పాటు ఆర్బీఎస్‌కే సేవలు, అందుతున్న తీరుతెన్నులను శాఖల వారీగా ప్రతిఒక్కరినీ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రు లు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీ లు, సీహెచ్‌సీల్లో రోగులకు అందుతున్న సేవల గురించి రోగులతో మాట్లాడారు. వేసవి దృష్ట్యా అం దరికీ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందేలా చూడాలని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లతో పాటు డిప్యూటీ డీఎంహెచ్‌వో పోటు వినోద్, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్, ఇమ్యునైజేషన్ ఆఫీసర్ నరేష్‌కుమార్, కంటి వెలు గు ప్రోగ్రాం అధికారి భావ్‌సింగ్‌లు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles