ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం

Fri,April 19, 2019 03:10 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్, జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా నుంచి ఎస్పీ, జేసీలు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రధానంగా కావాల్సిన ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాల గురించి వారు రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్‌ను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి సిబ్బంది నియామకం పూర్తయ్యిందని, వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో చేసిన ఏర్పాట్లపై ఎన్నికల అధికారి సంతృప్తి వ్యక్తం చేశారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles