నామాను భారీ మెజార్టీతో గెలిపించాలి..

Mon,March 25, 2019 01:30 AM

- టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
- ప్రతీ కార్యకర్తకు అండగా నిలుస్తా..: నామా నాగేశ్వరరావు

చింతకాని: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహ 16కు 16 సీట్లు గెలవడం ద్వారా ఢిల్లీలోని ఎర్రకోటపై పాగా వేద్దామని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. చింతకాని మండల పరిధిలోని ప్రొద్దుటూరు శ్రీ శబరి కల్యాణ మండపంలో ఆదివారం మధిర నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన నియోజకవర్గ స్థ్ధాయి విసృత స్థ్ధాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. బడ్జెట్‌లో రూ. 18వేల కోట్లు కేటాయించడం ద్వారా సీతారామ ప్రాజెక్టు పూర్తయి తద్వారా ఖమ్మం జిల్లా సస్యశామలం కానున్నదన్నారు. సీఎం నేతృత్వంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలో నంబర్‌వన్ స్థానంలో నిలిపారన్నారు. రైతు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల వ్యవసాయాన్ని పండుగ చేశారని, రైతుబీమా, రైతుబంధు, భూ రికార్డుల ప్రక్షాళన వంటి పథకాలు అమలు పరిచిన మొదటి రాష్ట్రమని తెలంగాణే అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం ఎంత మాత్రం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. అభివృద్ధిని చూసే పార్టీలోకి చేరుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ అఖండ విజయాన్ని అందించాలని ఆయన కోరారు. ఆంధ్రలో వైసీపీ.., ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గెలుస్తున్నారని జోస్యం చెప్పారు.

ప్రతీ కార్యకర్తకు అండగా నిలుస్తా..: నామా నాగేశ్వరరావు
టీఆర్‌ఎస్‌లో ప్రతీ కార్యకర్తకు, నాయకులకు అండగా ఉంటానని ఆ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. రెండు పార్లమెంట్ స్థ్ధానాలతోనే తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు. ఒకేసారి 16 ఎంపీ స్థ్ధానాలు గెలిపించి సీఎంకు అందిస్తే దేశ రాజకీయాలలో టీఆర్‌ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆనాడు పార్లమెంట్‌లో సీఎం కేసీఆర్‌కు తోడుగా తెలంగాణకు మొదటి ఓటు వేసింది తామేనని గుర్తు చేశారు. రైతుల సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిలా ఉన్నాయని, భారీ మెజార్టీతో ఖమ్మంలో ఎంపీగా గెలిపిస్తే ప్రజల వాణిని పార్లమెంట్‌లో గట్టిగా వినిపిస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని భ్రష్టు పట్టించాయని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణను నిర్మించుకుందామని పేర్కొన్నాడు.

రెండు లక్షల మెజార్టీ ఖాయం..: కొండబాల
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి సుమారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు తథ్యమని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ 16 ఎంపీలను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పడం తథ్యమని, అప్పుడే జాతీయస్థ్ధాయిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలకు సమప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం..: లింగాల కమల్‌రాజ్
పార్లమెంట్ ఎన్నికలకు క్షేత్రస్థ్ధాయిలో కార్యకర్తలు పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మధిర నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరు నడుచుకుందామని, పంచాయతీ ఎన్నికల్లో భారీ స్థ్ధాయిలో విజయం సాధించి పెట్టిన కార్యకర్తల కృషి మరువలేనిదన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మరోమారు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన పోరాటం మాదిరిగా కార్యకర్తలు, నాయకులు కష్టపడి ఖమ్మం పార్లమెంట్ స్థ్ధానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుక అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, మీగడ శ్రీనివాస్‌యాదవ్, బంధం శ్రీనివాసరావు, గూడూరు రమణారెడ్డి, దేవిశెట్టి రంగ, దొండపాటి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామక్రిష్ణ, దాసరి సామ్రాజ్యం, 5 మండలాలకు చెందిన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌లు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, రైతు సమన్వయ సమితి గ్రామ కన్వీనర్‌లు, సభ్యులు, వార్డు సభ్యులు హాజరయ్యారు.

66
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles