నేడు టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నామినేషన్

Mon,March 25, 2019 01:29 AM

- భారీగా హాజరుకానున్న నాయకులు కార్యకర్తలు
- పీజీ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ
ఖమ్మం, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ తరుపున ఖమ్మం లోక్‌స భ నుంచి పోటీ చేస్తున్న నామ నాగేశ్వరరావు సోమవారం ఉదయం నామినేషన్‌ను దాఖలు చేయ నున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ పీజీ కళాశాల మైదానం నుంచి ఇల్లెందుక్రాస్‌రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం లోక్‌సభ పరిధి లోని కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ర్యాలీ అగ్రభాగాన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, వైరా, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, లావుడ్యా రాములునాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, తాటి వెంకటేశ్వ ర్లు, బానోత్ మదన్‌లాల్, టీఆర్‌ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పిడమర్తి రవి, లింగాల కమలరాజు, బొమ్మెర రామ్మూర్తి, తెలుగుదేశం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకలు, కార్యకర్తలు తదితరులు అగ్రభాగాన ఉండనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కళాశాల గ్రౌండ్‌కు చేరుకున్న అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని నామి నేషన్ పత్రాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు అందజేయనున్నారు.

నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడం కేవలం 4 గంటల సమయం మాత్రమే ఉండటంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉదయానే నామినేషన్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర పార్టీ నుంచి శాసనసభ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఆదివారం లోక్‌సభ నియోజకవర్గ పరిధి లోని పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావే, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరై ప్రసంగించారు. ఐక్యమత్యంగా పని చేసి ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రికి ఖమ్మం జిల్లాపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకునేల ఖమ్మం గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.

63
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles