బీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అడుగులు

Mon,March 25, 2019 01:29 AM

మణుగూరు, నమస్తేతెలంగాణ/పాల్వంచ: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి వేగంగా అడుగులు పడుతున్నాయి.. అనుకున్న సమయానికి విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా జెన్కో అధికారులు పక్కా ప్రణాళికతో పనులు నిర్వహిస్తున్నారు. భద్రాధ్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపిఎస్)లో విద్యుత్ ఉత్పత్తికీ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తొలి యూనిట్‌లో బాయిలర్ లైటప్ చేసేందుకు అధికారులు సిద్ధం చేసుకున్నారు. ఈనెల 25న జెన్కో సీఅండ్‌ఎండీ ప్రభాకర్‌రావు చేతుల మీదుగా లైటప్ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈలైటప్ అనంతరం త్వరలోనే సింక్రనైజేషన్ వెంటనే విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. 2019లోనే ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేసేందు కు జెన్‌కో పక్కా ప్రణాళికలతో అందుకు తగ్గటుగానే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 270 మీటర్ల ఎత్తులో రెండు చిమ్నీల నిర్మాణం పూర్తయింది. యాష్ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదే విధంగా మండలంలోని కొండాయిగూడెం వద్ద నుంచి విద్యుత్ ప్లాంట్‌కు రావాల్సిన గోదావరి నీటిని సరఫరా చేసేందుకు 6.21 ఎకరాల్లో రూ.139 కోట్లతో ఇన్‌టేక్ వెల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్వీచ్ యార్డ్ నిర్మాణం పూర్తి కాగా ఇటీవల ఛార్జింగ్ పనులు కూడా నిర్వహించారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో భారీ నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన తక్కువ వ్యవధిలో చేసేందుకు సాంకేతిక నిపుణులు ఇంజనీరింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

పనులను పరిశీలించి జెన్కో డైరెక్టర్(ప్రాజెక్టు) సచ్చిదానందం
మణుగూరు, పినపాక మండలాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 1080 మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను ఆదివారం జెన్కో డైరెక్టర్(ప్రాజెక్టు) ఎం. సచ్ఛిదానందం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 25న భద్రాద్రి పవర్‌స్టేషన్ నందు యూనిట్-1లో లైటప్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్లాంట్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈలైటప్ కార్యక్రమానికి సీఅండ్‌ఎండీ ప్రభాకర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు, డీఈ(టీపీసీ) పీవీ శ్రీనివాస్, కన్సల్టెంట్ బి. దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles