4న ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్

Sun,March 24, 2019 12:23 AM

- సాయంత్రం 5.30గంటలకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ
- టీఆర్‌ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తున్న నేతలు
- కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ
- నామా గెలుపే ధ్యేయంగా ప్రణాళిక

ఖమ్మం, నమస్తే తెలంగాణ:రాజకీయ రణరంగం ప్రారంభమయింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రిలో మొదటి దశ నామినేషన్ల దాఖలకు ఒక్క రోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ తరుపున ఖమ్మం లోక్‌సభ నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు భరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీలో నిలుస్తారో తెలియలేదు. రేణుకచౌదరికి టికెట్టు ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నప్పటికి ఆ పార్టీకి చెందిన కొందరు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సిద్దమయ్యారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్‌లలో జరిగిన బహిరంగ సభలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ పీజీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ భహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఆ రోజు మధ్యాహ్నాం మహబూబాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని సాయంత్రానికి ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా ఈ బహిరంగసభ జరగబోతుంది.

భారీ జన సమీకరణ..
ఖమ్మంలో ఏప్రిల్ 4న నిర్వహించే బహిరంగసభను అత్యంత కీలకంగా నాయకులు భావిస్తున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ జన సమీకరణ చేయాలని నాయకులు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాపై ఉన్న అభిప్రాయాన్ని మార్చే దిశగా బహిరంగ సభను నిర్వహించాలని జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒకే స్థానాన్ని మాత్రమే టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మిగిలిన తొమ్మిది చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలలో ఖమ్మంలో మాత్రమే పువ్వాడ అజయ్‌కుమార్ గెలుపొందారు. ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో వైరా నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములు నాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే విధంగా పాలేరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, సత్తుపల్లి నుంచి గెలుపొందిన తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొందిన వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మధిర, అశ్వారావుపేట మినహా ఐదు నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నందున ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలుపు నల్లేరుపై నడకల ఉండనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నందున టీఆర్‌ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సహంతో కదన రంగంలోకి దూకుతున్నాయి.

నియోజకవర్గాలలో సన్నాహక సమావేశాలు...
టీఆర్‌ఎస్ నుంచి ఖమ్మం లోక్‌సభకు పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ పరిధిలోని అన్ని కేంద్రాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో శనివారం ఖమ్మం నియోజకవర్గ సమావేశం నిర్వహించగా ఆదివారం పాలేరు నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. తరువాత కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాలలో కూడా సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పరుగులు పెడుతున్నారు. సీఎం పాల్గొనే సభను విజయవంతం చేసి ఖమ్మం జిల్లా ఖ్యాతిని చాటేలా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.

అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా..
నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో జన సమీకరణ చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఖమ్మంలో వైసీపీ, మహబూబాద్ స్థానాన్ని టీఆర్‌ఎస్ గెలుచుకుంది. తరువాత జరిగిన రాజకీయ సమీకరణాల్లో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు.దీంతో రెండు స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి వచ్చాయి. మరో కొద్ది రోజుల్లో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలను గెలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాన్ని రచించారు.ఆ నేపథ్యంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఖమ్మం, మహబూబాబాద్ రావాల్సి ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున కేటీఆర్ పర్యటన వాయిదా పడింది.

102
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles