తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర మువ్వా

Sun,March 24, 2019 12:22 AM

ఖమ్మం కల్చరల్: ఖమ్మంలో సాహితీ సౌరభం వెల్లివిరిసింది.. కవులు రచయితలు, కళాకారులకు గుమ్మమైన ఖమ్మం మరోసారి రాష్ట్రస్థాయి సాహితీ వేదికైంది.. లబ్ధప్రతిష్టులైన కవులు, రచయితలు, సాహితీవేత్తలతో సంబురం అంబరాన్నంటింది. మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శనివారం రాష్ట్ర స్థాయి అవార్డుల సాహితీ పురస్కారోత్సవం ఘనంగా జరిగింది. పురస్కారాలను సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత దేవిప్రియ వేలాది మంది సాహితీ శ్రేయోభిలాషుల నడుమ అందుకున్నారు. 2017 సంవత్సరానికి డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ, 2018కి దేవిప్రియ అవార్డులు అందుకున్నారు. అతిథులు ఇద్దరిని ఘనంగా సత్కరించారు. సభలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కవి మువ్వా శ్రీనివాసరావు రచించిన మూడో సంకలనం వాక్యాంతం పుస్తకాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ, సాహితీవేత్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అమూల్యమైన సేవలందిస్తూ సామాజిక బాధ్యతగా ముందుకు పోతున్న మువ్వా శ్రీనివాసరావు సాహితీ సేవలు ప్రశంసనీయమన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలుగు భాషా మాధ్యమానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, భాషా వికాసానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని సూచించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుపై మక్కువతో తల్లిదండ్రుల పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సాహితీ సేవలు అందిస్తానని చెప్పారు. అనంతరం మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ నవ స్వరాంజలి పేరుతో తొమ్మిది మంది వర్థమాన కవులను ఘనంగా సత్కరించారు. భకు కవి నాగళ్ల వెంకటదుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మువ్వా విజయ్‌బాబు, పోట్ల నాగేశ్వరరావు, రామానంద తీర్థ సభ్యులు కిశోర్‌రెడ్డి, సాహితీవేత్తలు శిఖామణి, ఖాదర్‌మొహియుద్దీన్, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles