ఈవీఎంల మొదటి విడుత పరిశీలన పూర్తి..

Sun,March 24, 2019 12:21 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలకు గాను మొదటి విడత పరిశీలన పూర్తిచేసిన ఈవీఎంలను జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు కేటాయింపు ప్రక్రియను చేపట్టినట్లు కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో భద్రపర్చిన ఈవీఎం గదులను శనివారం రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. అనంతరం జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు కేటాయించబడిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్‌లను సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌తో కలిసి పరిశీలించారు. అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా ఈవీఎంలను విభజించిన అనంతరం రెండు రోజులలో తరలించడం జరుగుతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. సబ్‌కలెక్టర్ అనురాగ్ జయంతి, నోడల్ అధికారి మదన్‌గోపాల్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దారు రాంబాబు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles