మానుకోటపై గులాబీ జెండా ఎగురవేస్తాం

Fri,March 22, 2019 11:24 PM

మహబూబాబాద్, జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: మానుకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం ఖాయమైందని, మెజార్టీ పైనే తమ దృష్టంతా కేంద్రీకరించామని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 1న సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఇద్దరు గిరిజన మహిళలలకు అత్యున్నత పదవులు ఇచ్చి టీఆర్‌ఎస్ పార్టీ గౌరవించిందని, సీఎం కేసీఆర్‌కు జీవితాంతం గిరిజనులు రుణపడి ఉంటారని తెలిపారు. కేవలం 18 రోజుల సమయమే ప్రచారానికి ఉన్నందున ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. కేసీఆర్ దీవెనలతో, కేటీఆర్ సహకారంతో నాకు ఎమ్మెల్సీ పదవి, కవితకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేసే విధంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకేనని అన్నారు. ఒక కుటుంబంలో తండ్రి తన పిల్లల గురించి ఎలా ఆలోచిస్తారో సీఎం కేసీఆర్ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల గురించి అలాగే ఆలోచిస్తారని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు తీసుకొచ్చి మిడ్‌మానేర్ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్-1, స్టేజ్-2 ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం సాగు, తాగు నీటితో పాటు విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చిందని పనులు కూడా ప్రారంభయ్యాయని తెలిపారు. 16ఎంపీ స్థానాలు గెలిచి తీరుతామని, ఇందుకు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి నిండు మనసుతో దీవించాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ బాలాజీనాయక్, టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మార్నేని వెంకన్న, డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, డి.ఎస్.రవిచంద్ర, పార్టీ మహబూబాబాద్ మండల అధ్యక్షుడు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, బయ్యారం మండల పార్టీ అధ్యక్షుడు మూల మధుకర్‌రెడ్డి, ఎండీ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles