కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

Fri,March 22, 2019 11:24 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గరపడుతుండటంతో పార్లమెంట్ ఎన్నికలకు నిర్దేశించిన గడువులోగా నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వచ్చే మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలతో సహా మొత్తం ఇప్పటి వరకు ఈ పార్లమెంట్ స్థానానికి దాఖలైన నామినేషన్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామానికి చెందిన భూక్యా పార్వతి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తొలినామినేషన్ దాఖలు చేయగా, జిల్లాకు చెందిన గుండాల మండలం కాచనపల్లి గ్రామ నివాసి కోరం వెంకటేశ్వర్లు కూడా స్వంతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫారం అందుకున్న మాలోత్ కవిత మహబూబాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన ఐదు రోజుల వ్యవధిలో మొత్తం ఆరు నామినేషన్లు దాఖలుకాగా ఐదవ రోజు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ నుంచి మాలోత్ కవిత, కాంగ్రెస్ పార్టీ నుంచి పోరిక బలరాం నాయక్, స్వతంత్ర అభ్యర్థులుగా కల్తి ఎర్రయ్య, కోరం వెంకటేశ్వర్లు, భూక్యా భాను నాయక్ నామినేషన్లను దాఖలు చేశారు. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.

ఖమ్మంలో ఆరు నామినేషన్లు
ఖమ్మం, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదవరోజు శుక్రవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో స్వతంత్ర అభ్యర్థులు పర్సగాని నాగేశ్వరరావు, బచ్చల పద్మాచారి, నకిరికంటి సంజీవరావు, పిండిప్రోలు రామమూర్తితో పాటు సీపీఎం పార్టీ అభ్యర్థి వెంకట్, స్వతంత్ర అభ్యర్థి గూగులోత్ రమేష్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సీపీఎం అభ్యర్థి వెంకట్ నామినేషన్ పత్రాన్ని ఆ పార్టీ కేంద్ర కార్యదర్శి సీతారాం ఏచూరి ఆధ్వర్యంలో అందజేశారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles