పురుగుమందు తాగి కౌలురైతు మృతి

Fri,March 22, 2019 11:24 PM

కామేపల్లి, మార్చి 22 : పురుగుమందు తాగి కౌలురైతు మృతిచెందిన సంఘటన మండలంలోని బర్లగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్లగూడెం గ్రామానికి చెందిన నున్నావత్ గోరియా(50) కొంత భూమిని కౌలుకి తీసుకొని మిరప పంటను సాగు చేశాడు. సాగు చేసిన మిరప పంటకు తెగుళ్లు సోకడంతో ఆశించిన పంట దిగుబడి రాలేదు. పెట్టుబడులు కూడా తీర్చే పరిస్థితి లేకపోవడం, అప్పులు ఎలా తీర్చాలని కొద్ది రోజులుగా గోరియా తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో శుక్రవారం పంట చేలోనే పురుగుమందు తాగాడు. గమనించిన

చుట్ట్టు ప్రక్కల రైతులు కుటుంబ
సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే 108 కి సమాచారం అందించారు. 108 ద్వారా మహబూబాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని తెలపడంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles