కేటీపీఎస్‌లో మద్యం తాగిన పది మంది కార్మికుల సస్పెన్షన్

Fri,March 22, 2019 03:50 AM

పాల్వంచ: కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారంలో విధుల్లో ఉండి మద్యం తాగుతున్న 10 మంది కార్మికులను సస్పెన్షన్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. కేటపీఎస్‌ఓఅండ్‌ఎం కర్మాగారంలోని ఇంటిగ్రేటెడ్ కోల్ హ్యండ్లింగ్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు బుధవారం మద్యం పార్టీ నిర్వహిస్తున్నారు. షయం తెల్సిన ఎస్పీఎఫ్ సిబ్బంది స్థలానికి వెళ్లి సెల్‌ఫోన్‌లో వాటిని చిత్రీకరించి కోల్‌ప్లాంట్ ఎస్‌ఈ (ఇన్‌చార్జి, సీఈ) నరసింహకు అందజేశారు. వెంటనే ఆయన విచారణ చేపట్టి ముందుగా 10 మందిని పైఅధికారుల సూచన మేరకు సస్పెన్షన్ చేశారు. ఇందులో మరో ఆరుగురు వ్యక్తులు కూడా ఉన్నట్లుగా తెలిసింది. అసలు కీలక సూత్రదారిని అధికారులు పక్కకు పెట్టినట్లు కొందరు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఈని విలేకరులు సంప్రదించగా సమగ్ర విచారణ చేస్తున్నామని, ఎవరైనా ఉన్నారని తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles