వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

Fri,March 22, 2019 03:50 AM

చర్ల: దేవానగరంలో శ్రీఅలివేలుమంగా పద్మావతి సమేతంగా కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి వారి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. మండల కేంద్రం చర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేంకటేశ్వరప్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. కొండగుహలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల మద్య అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి కల్యాణం కన్నులారా వీక్షించిన భక్తులు తన్మయత్వానికి లొనయ్యారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు ముందుగా గర్భగుడిలోని తమ ఆరాధ్యదైవాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కల్యాణ మండపానికి చేరుకొని స్వామివార్ల కల్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయకమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూరానంతమంది భక్తులు ఈయేడాది భారీ వచ్చారు. సర్పంచ్ బాలక్రిష్ణ దగరుండి భక్తులకు తీర్ధప్రసాదాలు అందేలా చూశారు.

పర్ణశాల: పవిత్ర గోదావరి నదీ తీరానగల సున్నంబట్టి గ్రామంలో కొలువైన వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. శుద్ధ పౌర్ణమి ఉత్తర నక్షత్ర అభిషిత్ లగ్నమందు స్వామి వారి కల్యాణ వేడుక జరిపించారు. ఆలయంలో గురువారం ఉదయం 3.30 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. తదుపరి స్వామి వారికి అభిషేకాలు చేశారు. తొలుత ఎదుర్కోలు మహోత్సవం, అనంతరం కల్యాణం జరిగాయి. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపుగా తీసుకెళ్ళి గోదావరిలో తెప్పోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణ కార్యక్రమంలో భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ రాజశేఖర్ దంపతులు పాలొన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles