ఆనందోత్సాహాలతో హోలీ సంబురాలు

Fri,March 22, 2019 03:50 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ/చర్ల/దుమ్ముగూడెం: భద్రాచలం పట్టణంలో హోలీ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పిల్లలు, పెద్దలు ఉత్సాహంగాఈవేడుకలో పాల్గొన్నా రు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ద్విచక్రవాహనాలపై కలియ తిరుగు తూ ఆనందోత్సవంగా గడిపారు. ఇదిలా ఉండగా భద్రాచ లం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్, సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రా, ఏఎస్‌పీ రాజేష్‌చంద్ర, భద్రాచలం పట్టణ సీఐ సత్యనారాయణరెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాస్ హోలీ వేడుకలో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోళీ పండుగను మండలంలోని ప్రజలు అనందోత్సాహాలతో జరుపుకున్నారు. కాముడి దహనం అనంతరం ఉదయం నుంచి యువకులు, పిల్లలు రోడ్లపైకి వచ్చి రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగులు చల్లుకుని సంబురాలు చేసుకున్నారు. దుమ్ముగూడెం మండలవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాల నడుమ హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యువత, చిన్నారులు రోడ్డుపైకి చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోళీ రంగేళిని ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరిపారు. దీంతో ఏజెన్సీ ప్రాంతమంతా సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయాన్నే ఇంటిముంగిటకు చేరి యువత రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఆనందంతో హోళీ వేడుకలను నిర్వహించారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles