సంతాన వేణుగోపాలస్వామి తిరుకల్యాణం

Fri,March 22, 2019 03:49 AM

సారపాక: బూర్గంపాడు మండలంలోని ఇరవెండి గ్రామంలో గోదావరి నదీతీరాన కొలువైన శ్రీసంతాన వేణుగోపాలస్వామి తిరుకల్యాణం గురువారం కన్నులపండువగా జరిగింది. వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, భాజాభజంత్రీల నడుమ అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12.06 గంటలకు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. ప్రవాసభారతీయులు, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ తాళ్లూరి జయశేఖర్, నీలిమ దంపతులు స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. స్వామివారికి ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి అనంతరం కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు సమీప ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. దేవస్థానం చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య ఆధ్వర్యంలో తాళ్లూరి జయశేఖర్, నీలిమ దంపతులు స్వామివారికి కల్యాణాన్ని నిర్వహించి అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. రెండు రోజులుగా ఈ కల్యాణ ఏర్పాట్లను నిర్వాహకులు, ఇరవెండి ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, మోతే ఉపసర్పంచ్ బిక్కసాని శ్రీనివాస్ తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇరవెండి సర్పంచ్ కొర్సా లక్ష్మి, తాళ్లూరి రాధాకృష్ణ, తాళ్లూరి రమేష్, చేకూరి ప్రసాద్, మాడపాటి ప్రకాష్, ఇరవెండి ఉపసర్పంచ్ తాటికొండ రామచందర్‌రావు, వార్డుసభ్యులతో పాటు సమీప గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు

50
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles