హోలీ సంబురాలు

Fri,March 22, 2019 03:49 AM

మణుగూరురూరల్/సారపాక/కరకగూడెం/పినపాక: నియోజకవర్గ ప్రజలు ఆనందోత్సవాలతో గురువారం హోలీ పండగను ఘనంగా జరుపుకున్నా రు. ప్రతి ఒక్కరూ.. ఆనందంతో చిన్నా..పెద్ద అనే తారతమ్యం లే కుండా హోలీ వేడుకల్లో మునిగిపోయారు. అందరూ రంగులు పూ సుకున్నారు. ఆటపాటలతో నృత్యాలు చేశారు. మణుగూరు పట్టణంలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఆయా పార్టీల, యూనియన్, అసోసియేషన్‌ల కార్యాలయాల్లో నాయకులు హోలీ సంబరాలను జరుపుకున్నారు. మణుగూరు డీఎస్పీ రాయిళ్ళ సాయిబాబా, సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా బంగ్లాస్ కాలనీలో ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు, భద్రాద్రి పవర్‌ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ పిల్లి బాలరాజు దంపతులు, మణుగూరు ఏరియా బొగ్గుగనులపై టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వి.ప్రభాకర్‌రావు నిర్వాహకులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. బూర్గంపాడు మండల వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో చిన్నారులు, మహిళలు, యువతీయువకులు రంగులు చల్లుకుంటూ ద్విచక్రవాహనాలపై సందడి చేశారు. గిరిజన లంబాడీలు తమ సాంప్రదాయ నృత్యాలతో తండాల్లో హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. పినపాక మండలంలో హోలీ వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. ఏడూళ్ళబయ్యారం, జానంపేట, పినపాక గ్రామాల్లో హోళీ సంబరాలు అంబరాన్నంటాయి. కరకగూడెం మండలంలో వేడుకలు జరిగాయి. మండల కేంద్రంతో పాటు కల్వలనాగారం, భట్టుపల్లి, సమత్‌భట్టుపల్లి, గొల్లగూడెం ఆయా గ్రామాల్లో యువకులు హోలి వేడుకల్లో పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles