పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి

Fri,March 22, 2019 03:49 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం జరగనున్నందున ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్స్ కూడా పంపిణీ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ రిటర్నింగ్ అధికారి, భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. వీటిని జేసీ పరిశీలించి మాట్లాడారు. భద్రాచలం పరిధిలోని ఎనిమిది మండలాల్లో ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బందికి మెటీరియల్స్ పంపిణీ చేసి పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎన్నికల నిర్వహణ డిప్యూటీ తహసీల్దార్ నాయక్, డీడీ రామ్మూర్తి, సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles