నామా గెలుపును కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తాం

Fri,March 22, 2019 03:49 AM

రామవరం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలే పరమావధిగా మాజీ శాసనసభ్యుడు జలగం వెంకటరావు నాయకత్వంలో ఖమ్మం టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామానాగేశ్వరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తామని కొత్తగూడెం సింగరేణి ఏరియాలోని కార్మిక ప్రాంతాలైన రుద్రంపూర్, పెనగడపకు చెందిన పలువురు పేర్కొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, అందుకు కట్టుబడి అభ్యర్థి గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ నాయుకులు గూడెళ్లి యాకయ్య, సయ్యద్ ఇస్మాయిల్, చెరిపల్లి నాగరాజు, కొంకటి కృష్ణ, సొప్పరి శంకర్, పొనగంటిరాజు, బన్నపద్మ, పరమేష్, సన్ని, బన్ని, ఇల్లుటూరి పవన్, హైట్ శివ, సొప్పరి క్రాంతి, మిట్టబోయిన శివ, బరిగ శంకర్, పొట్టి క్రాంతి, ఫయాజ్, వేముల సందీప్, బాలాజీ, శనిగరపు శ్రీనివాస్, రాజన్న రాసూరి శంకర్, సంపత్ తదితరులు ఉన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles