ఈవీఎంపై అవగాహన తప్పనిసరి..!

Thu,March 21, 2019 12:20 AM

మణుగూరు, నమస్తే తెలంగాణ: ఎన్నికల నిర్వహణలో ఈవీఎం వినియోగం ఒక సరికొత్త సాంకేతికతకు నాంది పలికినట్లేనని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈవీఎం, వీవీప్యాడ్ వినియోగంపై సెక్టోరియల్ అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలోని బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు తాను వేసిన ఓటును తను ఎంపిక చేసుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి పడుతుందన్న అపోహ ప్రజల్లో ఉండేదన్నారు. కానీ ఈవీఎంలతో అదిపోయిందన్నారు.మణుగూరు తహసీల్దార్ నల్లపు తిరుమల ప్రకాష్‌రావు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.

ఓటుహక్కును వినియోగించుకోవాలి..
ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయాలని, వందశాతం ఓటుహక్కు వినియోగించుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. ఆయన బుధవారం మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా స్ట్రాంగ్ రూం ఏర్పాటు కోసం మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల కోసం పినపాక నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో మణుగూరు తహసీల్దార్ నల్లపు తిరుమల ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles