సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం

Thu,March 21, 2019 12:19 AM

కొత్తగూడెం ఎడ్యుకేషన్: రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకుడు కూసపాటి శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల ఎమ్మెల్యేల జోలికొస్తే సహించబోమని అన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును తన పదవికి రాజీనామా చేయమని చెప్పే హక్కు కోనేరు చిన్నికి లేదని, ఇంటి ఎదుట ధర్నా చేస్తానని ఒక బీసీ ఎమ్మెల్యేను బెదిరిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కౌడగాని పరమేష్ యాదవ్, పీకే కృష్ణ, ఎండీ మున్వర్, నక్కా సృజన, రాము, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles