ఈజీఎస్ సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలి

Wed,March 20, 2019 12:33 AM

పాల్వంచ రూరల్, మార్చి 19: ఉపాధిహామీలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఉపాధిహమీ ఏపీడీ కరుణాకర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశమందిరంలో జరిగిన ఉపాధిహమీ 12 విడత సామాజిక తనికి కార్యాలయ వేదికలో మండలంలో గత సంవత్సరం ఉపాధిహామీ ద్వార జరిగిన రూ. 6.4 కోట్ల వివిధ రకాల పనులను వివిధ శాఖల అధికారులతో తనిఖీ నిర్వహించారు. మండలంలోని పలుచోట్ల క్షేత్రస్థాయి సిబ్బంది రికార్డుల నమోదులో చిత్తశుద్ధిగా వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని యానంబైలు, పాయకారి యానంబైలు తదితర పంచాయితీలో జరిగిన పనుల్లో కూలీల వేతనాల నమోదులో అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఒకరి బదులో మరోకరు పనులు చేసిన అవకతవకలను ఆయన గుర్తించారు. పలుమార్లు సంబందిత అధికార్ల సంతకాలు లేకుండానే చెల్లింపులు జరిగాయని, ఈ విధంగా పలుమార్లు జరిగిందని, విధుల పట్ల సక్రమంగా వ్యవహరించడంలేదని ఏపీవో రంగాను హెచ్చరించారు. విధలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు లక్ష్మి, రవి, నాగేశ్వరావులను మందలించారు. పీల్డ్ అసిస్టెంట్లు ప్రతీ రోజు పని జరిగే ప్రదేశానికి వెళ్లి హజరు నమోదు చేయాలన్నారు. కా ర్యక్రమంలో వివిధ శాఖల అధికారులు రాంమోహన్, మ ధుసూధన్‌రాజు, సీహెచ్ వెంకటేశ్వర్లు, భాస్కర్‌రావు, గంగరాజు, ఎంపీడీవోలు అల్బర్, ధన్‌సింగ్ పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles