ఉన్నత లక్ష్యాలే విజయానికి సోపానాలు

Wed,March 20, 2019 12:33 AM

కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 19: విద్యార్థి దశలో ఏర్పర్చుకున్న ఉన్నత లక్ష్యాలే విజయానికి సోపానాలవుతాయని సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ శైలజాఝాన్సీ అన్నారు. మంగళవారం స్థానిక సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకొని వెళ్తున్న విద్యార్థినులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటి సంవత్సరం పీజీ విద్యార్థినులు ద్వితీయ సంవత్సరం విద్యార్థినులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శైలజాఝాన్సీ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. మంచి చేయడం అనేది బాధ్యతగా కాకుండా ఉల్లాస భరితంగా చేయడం వల్ల వారి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని ఆమె అన్నారు. విద్యార్థుల్లో ప్రతికూల ఆలోచనలు తగ్గించుకొని అనుకూల ఆలోచన విధానాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలో విజయాన్ని సాధించవచ్చని అన్నారు. జీవితం అనేది అవకాశాలను కల్పిస్తుందని, కానీ అందిపుచ్చుకోవడంలోనే విద్యార్థుల విజయం దాగి ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత ఆశయాలతో సమాజానికి బాధ్యులుగా నిలవాల ని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వీఎస్ మాణిక్యాంబ, షాహీన్ లయాక్, ఉషారాణి, విశాలిని, రాజ్యలక్ష్మీలు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles