పామాయిల్ తోటలతో దీర్ఘకాలిక ఆదాయం

Wed,March 20, 2019 12:32 AM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: పామాయిల్ తోటలతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం లభిస్తుందని, అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు తోటలు దోహదపడతాయని ఆయిల్‌ఫెడ్ ఏరియా ఆఫీసర్ సపావత్ శంకర్ విద్యార్థులకు తెలిపారు. పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అనేక రాయితీ పథకాలు అందజేస్తుందని చెప్పారు. అశ్వారావుపేట అవేర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మంగళవారం మండలంలోని నారంవారిగూడెం పామాయిల్ నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా పామాయిల్ సాగు, వ్యయం, రైతుల ఆదాయం, ప్రభుత్వ రాయితీలను ఆయన వివరించారు. పామాయిల్ తోటల్లో అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. రాయితీపై మొక్కలను రైతు లకు పంపిణీ చేయటమే కాకుండా నాలుగేళ్ల పాటు ఎరువులను ఉచితంగా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. దీనితో పాటు సాగునీటి వృథా నియంత్రణకు సబ్సీబిపై బిందు సేద్యం యూనిట్లు కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పామాయిల్ తోటలు దీర్ఘకాలిక ఆదాయం ఇవ్వటంతో పాటు పచ్చదనంతో ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ లతో ప్రస్తుతం రైతులు పామాయిల్ సాగుపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వీరన్న గౌడ్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles