రైతు పాసుపుస్తకం, రూ.40వేలు అపహరణ

Wed,March 20, 2019 12:31 AM

చండ్రుగొండ: బ్యాంకులోకి పనిమీద వచ్చిన రైతు పట్టాదారు పాసుపుస్తకం, రూ.40వేలు నగదు అపహరణకు గురైనా సంఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు , పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...దామరచర్ల గ్రామానికి చెందిన రైతు సంగొండి రాఘవులు స్థానిక స్టేట్‌బ్యాంకు ఆప్ ఇండియా బ్రాంచిలోకి వెళ్లాడు. బ్యాంకులోకి వెళ్లేటప్పుడు తన వెంట రూ.40వేలు, పట్టదారు పాసు పుస్తకం, మూడు బ్యాంకు పుస్తకాలు ఒక కవర్‌లో పెట్టుకొని, బ్యాంకులో గల టేబుల్ వద్ద ఓచర్ రాసుకొని కౌంటర్‌లో పని చూసుకొని, తిరిగి వెళ్లేటప్పుడు కవర్‌ని రైతు మర్చి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసుకొనగా కవర్, అందులోని నగదు, పాసు పుస్తకాలు, పట్టాదారు పుస్తకం అక్కడ కనపడలేదు.దీంతో బ్యాంకులో విచారించిన రైతు ,వెంటనే స్థానిక పొలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో ఎస్సై కడారి ప్రసాద్ బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజ్‌ని పరిశీలించగా , ఇద్దరు మహిళలు తమ వెంట కవర్‌ని తీసుకెళ్లిన్నట్లు గుర్తించాడు. అయితే ఆ మహిళల ముఖాలు సరిగ్గా గుర్తిం చేలా లేక పోవడంతో ఇప్పుడు నగదు , పాసు పుస్తకాలు , పట్టాదారు పాసు పుస్తకం అపహరణ పెద్ద సవాలుగా మారింది. దీనిపై ఎస్సై మాట్లాడు తూ...కేసును విచారిస్తున్నామన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles