హోలీని ప్రశాంతంగా జరుపుకోవాలి

Wed,March 20, 2019 12:31 AM

మణుగూరు, నమస్తేతెలంగాణ, మార్చి 19: అనుమతులు లేకుండా మ హిళలు, యువతులపై రంగులు జల్లి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని మణుగూరు డీఎస్పీ రాయిళ్ల సాయిబాబా హెచ్చరించారు. ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. హోలీ పండుగ ఆనంద కేళీగా మారడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందరూ సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించి అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకోవాలన్నారు. యువకులు హోలీ ఆడే సమయంలో ద్విచక్ర వాహనాలపై ముగ్గురు వెళ్లినా, పెద్దపెద్ద సౌండ్ వచ్చే సైలెన్సర్లు వాడిన, మద్యం తాగి వాహనాలు నడిపిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హోలీ పండుగ సందర్భంగా ఎవరూ గోదావరి స్నానాలకు వెళ్లవద్దన్నారు. ప్రతి ఏటా గోదావరి స్నానాలకు వెళ్లడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, గోదావరిలో మునిగి చనిపోతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గోదావరి స్నా నాలకు వెళ్లవద్దన్నారు. ఎలాంటి అల్లర్లకు పాల్పడవద్దన్నారు. కొందరు రంగులు జల్లుకునే క్రమంలో రోడ్లపై అల్లర్లకు పాల్పడుతూ, ప్రజలకు ఇబ్బందులు కలిగి స్తున్నారని, ఎవరైనా సరే అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles